ఖమ్మం జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి.బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ లో పొంగులేటి మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
పొంగులేటి తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు తొలగించారు.
ఈ క్రమంలోనే తన ఫొటోతో సంక్రాంతి పండుగ మెస్సేజ్ లు పోస్ట్ చేశారని తెలుస్తోంది.అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలలో పొంగులేటి పార్టీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు పొంగులేటి పార్టీ మారుతున్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీల్లో కేడర్ కు చెబుతున్న విషయం తెలిసిందే.పొంగులేటి తాజాగా ఫేస్ బుక్ లో చేసిన మార్పుల అంశం చర్చనీయాంశంగా మారింది.







