ఈ భూమి మీద ఉన్న ఎన్నో రకాల తీగజాతి మొక్కలు ఆయుర్వేదంలో చాలా రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.తీగజాతి కాయగూరలలో దొండకాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ముఖ్యంగా దొండ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.ఇవి తీవ్రమైన వ్యాధికారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
దొండ కాషాయం లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయోటిన్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.
అంతేకాకుండా దొండకాయల్లో సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి12, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు వ్యాధికారకాలను నశింపజేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.దొండకాయను రోజు వారి ఆహారంలో తీసుకున్నట్లయితే ఇందులో ఎక్కువగా లభించే విటమిన్ b6, బి12, యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం నాడీ వ్యవస్థ లోపాలను తగ్గించి మనలో తలెత్తే చిరాకు, ఆందోళన, మూర్చ వ్యాధి లక్షణాలను అదుపులో ఉంచుతాయి.
అంతేకాకుండా మెదడు కండరాలను న్యూరాన్స్ శాంతపరిచి మెదడు ఆరోగ్యాన్ని జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.దొండకాయలోని ఔషధ గుణాలు కాలయంలోని మలినాలను బయటకు పంపుతాయి.ఫలితంగా ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించి డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది.
చక్కెర డయాబెటిస్ తో బాధపడేవారు దొండ ఆకు కాషాయాన్ని 30 గ్రాముల మోతాదులో ప్రతిరోజు తీసుకుంటే చక్కర వ్యాధి అదుపులో ఉంటుంది.దొండకాయ పిత్త వ్యాధులను రక్తపోటును వాత వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
ఇందుకు కారణం దొండకాయలతో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది.చర్మ సమస్యలతో బాధపడేవారు దొండ ఆకులను మెత్తగా చూర్ణం చేసి చర్మ సమస్యలు ఉన్నచోట మృదువుగా మర్దన చేసుకున్న బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడేవారు మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మంట సమస్యతో బాధపడేవారు తరచూ దొండ ఆకుల కాషాయాన్ని సేవిస్తే ఫలితం ఉంటుంది.