టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నిఖిల్ సిద్ధార్థ్ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఈయన ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను నిఖిల్ పర్ఫెక్ట్ గా వాడుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత నిఖిల్ నెక్స్ట్ రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ సినిమాల క్రేజ్ కూడా బాగా పెరగడం విశేషం.ప్రెజెంట్ నిఖిల్ 18 పేజెస్ సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించు కునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా జరుగుతున్నాయి.మరొక 24 గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ వస్తుంది.
ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి సమాచారం అందుతుంది.ఈ సినిమా నాన్ థియేట్రికల్ గానే మంచి ప్రాఫిట్స్ అందుకుందట.16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బిజినెస్ బాగానే జరిగినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా రైట్స్ అన్ని కలుపుకుని 22 కోట్ల వరకు ఇచ్చినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే 6 కోట్ల ప్రాఫిట్ పొందిన ఈ సినిమా బిజినెస్ వివరాలు చుస్తే.వరల్డ్ వైడ్ గా దాదాపు 12 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం.మరి ఈ సినిమా ఫైనల్ గా సక్సెస్ అవ్వాలంటే 12.50 కోట్ల టార్గెట్ ను అందుకోవాల్సి ఉంటుంది.మరి ఈ టార్గెట్ ను నిఖిల్ రీచ్ అయితే మరో రేంజ్ కు వెళ్లడం ఖాయం.

కుమారి 21F సినిమా ఫేమ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించాడు.ఇక ఈ సినిమాలో కూడా కార్తికేయ 2 జోడీనే కనిపించ బోతున్నారు.అలాగే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.చూడాలి ఈ సినిమా ఎలా అలరిస్తుందో.







