న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు అనే విషయం తెలిసిందే.ఎందుకంటే ఈయన మొదటి నుండి విభిన్న కథలతో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.
ఇక నాని చేతిలో ప్రెజెంట్ క్రేజీ సినిమాలు ఉన్నాయి.
ఒకవైపు సినిమాలు చేస్తూ.
మరో వైపు తన లైనప్ ను సెట్ చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.అయితే తాజాగా నాని తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసాడు.2022 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ ఫుల్ క్రాఫ్, గడ్డంతో ఎంతో స్టైలిష్ గా దిగిన ఫోటోలను షేర్ చేసాడు.ఈ ఫోటోలు సోషల్ మాధ్యమాల్లో మంచి వైరల్ గా మారిపోయాయి.
ఈ ఫోటోలను నాని ఫ్యాన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవలే నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా ఆశించిన విజయం సాధించక పోవడంతో ఈయన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.నాని ప్రెజెంట్ దసరా సినిమా చేస్తున్నాడు.
శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు.గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను 2023 మార్చి 30న రిలీజ్ కాబోతుంది.అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.
చూడాలి ఈ సినిమాతో నాని సాలిడ్ హిట్ అందుకుంటాడా లేదా.







