టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ఈ ఏడాది లక్కీ ఇయర్ అని చెప్పవచ్చు.వినయ విధేయ రామ సినిమా ఫలితంతో ఢీలా పడిన రామ్ చరణ్ కు ఆర్.
ఆర్.ఆర్ సినిమా ఫలితం ఉత్సాహాన్నిచ్చింది.ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.మాస్ రోల్స్ అయినా క్లాస్ రోల్స్ అయినా చరణ్ సత్తా చాటుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
రెండు రోజుల క్రితం ఉపాసన గర్భవతి అని అధికారిక ప్రకటన వెలువడటంతో చరణ్ తండ్రి కాబోతున్నారనే వార్త ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది.అయితే ఇదే సమయంలో రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.
మోదీ, అంబానీలతో కలిసి చరణ్ వేదిక పంచుకోనున్నారనే వార్త మెగా అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.వరుసగా వేర్వేరు అవార్డులను సొంతం చేసుకుంటూ చరణ్ నటుడిగా మరో మెట్టు పైకి ఎదుగుతుండటం గమనార్హం.

ఈరోజు అహ్మదాబాద్ లో స్వామీ మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాలు జరగనుండగా ఈ ఉత్సవాలలో మోదీ, ముఖేష్ అంబానీ పాల్గొననున్నారు.అయితే చరణ్ కు కూడా ఈ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం లభించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.కొన్ని నెలల్లోనే చరణ్ జాతకం పూర్తిస్థాయిలో మారిపోయిందని చరణ్ పట్టిందల్లా బంగారం అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఈవెంట్ కు చరణ్ ఆహ్వానం తీసుకుంటున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ అరుదైన గుర్తింపు రామ్ చరణ్ కు మాత్రమే దక్కడం ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.







