పవన్‌ ఉస్తాద్‌ సినిమాలో హీరోయిన్ ఆమె కాకుంటే మరెవ్వరు?

పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.ఇటీవల మొదటి షెడ్యూల్ ప్రారంభం అవ్వడం తో సినిమా కు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

 Pawan Kalyan Ustaad Bhagat Singh Heroine , Pawan Kalyan , Harish Shankar, Pooja-TeluguStop.com

ముఖ్యంగా ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతుంది.ఆ మధ్య దర్శకుడు హరీష్ శంకర్ రెండు మూడు సార్లు తన తదుపరి సినిమాల్లో హీరోయిన్ పూజా హెగ్డే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

అన్నట్లుగానే భవదీయుడు భగత్‌ సింగ్ సినిమా యొక్క హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక చేయడం జరిగింది.కానీ కథ విషయంలో మార్పులు జరిగాయి.

మొత్తం సినిమా ని మార్చేశారు.అందుకే ఇప్పుడు ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమా లో హీరోయిన్ గా పూజా హెగ్డే కాకుండా మరో ముద్దుగుమ్మ ను నటింపజేసేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

పవన్ కు జోడి గా నటించే ఆ హీరోయిన్ ఎవరు అనేది అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది.పూజ హెగ్డే అయితే బాగుంటుందని అంతా భావించారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ను తప్పించడం తో ఆమె అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఆమె మహేష్ బాబు తో సినిమా చేస్తుంది.

రెండు సినిమాలకు ఒకే సారి డేట్లు ఇవ్వాల్సి వస్తుండడం తో నో చెప్పిందని వార్తలు కూడా వస్తున్నాయి.

మొత్తానికి పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా లో పూజా హెగ్డే కాకుండా మరో కొత్త హీరోయిన్ నటించబోతుంది.ఆ హీరోయిన్ ఎవరు అనేది మరికొన్ని రోజులైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేక పోలేదు.పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది.

కనుక ఈ అమ్మడు ఇప్పుడు పవన్ సినిమా కోల్పోతే కెరీర్‌ లో చాలా పెద్ద నష్టం ఆమెకు తప్పదు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube