బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇలా తెలుగులో ఈ కార్యక్రమం ఆరవ సీజన్ పూర్తి కానుంది.
ఇక ఆరవ సీజన్లో 21 మంది కంటెస్టెంట్ లో పాల్గొనగా ప్రస్తుతం 6 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు.ఇక మొదటి నుంచి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క టాస్క్ లోను గట్టి పోటీ ఇస్తూ ముందంజలో ఉన్న రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అని అందరూ కూడా భావించారు.
ఇక రేవంత్ సైతం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే ఎలాగైనా కప్పు సాధించే ఇంటికి వస్తానని పోస్ట్ కూడా చేశారు.
ఈ విధంగా రేవంత్ హౌస్లో కొనసాగుతున్న సమయంలో కూడా తానే విన్నర్ అంటూ ఎన్నోసార్లు చెప్పుకున్నారు.
ఇక సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి.ఇకపోతే తాజాగా బిగ్ బాస్ విన్నర్ గురించి గూగుల్ తల్లి షాకింగ్ న్యూస్ చెప్పేశారు.
అందరూ అనుకున్న విధంగా రేవంత్ విన్నర్ కాదంటూ గూగుల్ చెప్పడంతో రేవంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.గూగుల్ లో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరు అని సెర్చ్ చేస్తే రేవంత్ పేరుకు బదులు రోహిత్ పేరు చూపించడం గమనార్హం.

ఎలాంటి కీవర్డ్ తో వెతికినా అతని పేరే కనిపిస్తుంది.అది మిస్టేకో లేదా ఇంకేదైనా కావొచ్చు కానీ, నిజానికి రోహిత్ కూడా విన్నర్ మెటీరియల్ అని చాలామంది భావిస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి రోహిత్ టాస్కుల విషయంలో కూడా గట్టి పోటీ ఇస్తూ ఎంతో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నారు.ఇకపోతే రోహిత్ కి సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
దీంతో రోహిత్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఈయన అభిమానులు భావిస్తున్నారు.మరి గూగుల్ చెప్పినట్టు రేవంత్ కాకుండా రోహిత్ విన్నర్ అవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.







