బైక్‌పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.ఎందుకంటే హెల్మెట్ ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ప్రాణాలు కాపాడగలుగుతుంది.
బైక్స్‌పై నుంచి కింద పడిపోగానే ముఖ్యంగా తలకి దెబ్బ తగిలి చాలామంది చనిపోతుంటారు.అలాంటి ప్రమాదాలను 99% హెల్మెట్లు నివారిస్తాయి.
అందుకే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ల ధరించాలని విజ్ఞప్తి చేస్తుంటారు.ధరించని వారికి ఫైన్స్ విధిస్తూ అందరినీ హెల్మెట్ ధరించేలా చేస్తున్నారు.
కానీ కొందరు మాత్రం హెల్మెట్ పెట్టుకోకుండా రైడింగ్ చేస్తున్నారు.అయితే, అలాంటి వారికి హెల్మెట్ ప్రాముఖ్యతను తెలిపే ఒక వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్‌ను డ్రైవ్ చేస్తూ ఒక్కసారిగా కిందపడ్డాడు.అదే సమయంలో ఎదురుగా ఓ బస్సు వచ్చింది.అతడి తల సరిగ్గా ఆ బస్సు వెనకాల టైర్ల కింద పండింది.బస్సు అతడి తలపైకి ఎక్కింది.
అదృష్టవశాత్తు అతను హైల్మెట్ ధరించి ఉండటం వల్ల తలకి పెద్దగా గాయాలు కాలేదు.ఆ బస్సు టైర్ కారణంగా హెల్మెట్ మాత్రం బాగా డామేజ్ అయింది.
అయినా కూడా ఆ బైకర్ ప్రాణాలు పోలేదు.అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను @tansuyegen తాన్సుయోగెన్ అనే ప్రముఖ ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.తర్వాత హెల్మెట్ వల్ల ఎంత ఉపయోగం ఉందో ఇప్పుడు తెలుసుకున్నామని కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియో చివరిలో కొందరు స్థానికులు అతను చచ్చిపోయాడేమోనని అనుకుని ఆందోళన పడ్డారు.
తర్వాత బతికుండటం చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
అలాగే మీ శ్రేయోభిలాషులకి పంపించి హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేయండి.







