ఒకప్పుడు రొటీన్ మాస్ మసాలా సినిమాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించిన జూనియర్ ఎన్టీఆర్ కథల విషయంలో, డైరెక్టర్ల విషయంలో చేసిన తప్పులను తెలుసుకుని రూటు మార్చి ప్రస్తుతం వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ఆర్.
ఆర్.ఆర్ లో ఒక హీరోగా నటించి నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కిన తారక్ కొరటాల శివ సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో తారక్ పాత్ర కుడి చేతికి ఆరు వేళ్లు ఉంటాయని సమాచారం అందుతోంది.దేశంలో చేతికి ఆరు వేళ్లు ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.ఈ విధంగా ఆరు వేళ్లు ఉండటంలో కూడా ప్రత్యేకత లేదు.అయితే ఈ సినిమాలో తారక్ పాత్ర ఎమోషనల్ అయిన ప్రతి సందర్భంలో ఆరో వేలు బిగుసుకుపోతుందని బోగట్టా.
తారక్ పాత్రకు కోపం వస్తే వేలి ద్వారానే కోపం వచ్చిందని చూపిస్తూ సరికొత్త స్క్రీన్ ప్లేతో కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం.

ఆర్.ఆర్.ఆర్ సినిమా సక్సెస్ తో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న హీరోల జాబితాలో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో ఆరో వేలితో చరిత్ర సృష్టించబోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి తారక్ స్పెషల్ వీడియో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఈ వీడియో ఉంటుందని బోగట్టా.

వరుస అప్ డేట్స్ తో ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలను విపరీతంగా పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ తో పాటు ఇతర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.బాలీవుడ్ బ్యూటీ తారక్ కు జోడీగా నటించే లక్కీ ఛాన్స్ ను సొంతం చేసుకుందని త్వరలో ఆ వివరాలను కూడా వెల్లడించనున్నారని సమాచారం.ఈ సినిమాతో రికార్డులు బద్దలవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







