సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించిన డేటింగ్ వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.నిత్యం ఏదో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన డేటింగ్ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
కొంచెం చనువుగా కనిపించినా చాలు ఆ సెలబ్రిటీల మధ్య ప్రేమ నడుస్తుందని వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇలా వారికి ఇష్టం వచ్చిన విధంగా కథనాలు రాస్తూ ఉంటారు.ఈ క్రమంలో గత నాలుగు ఐదు రోజులుగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో పాటు ఇటీవలే బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, రివ్యూయర్ కమల్ రషీద్ ఖాన్ కూడా వారి పై చేసిన ట్వీట్ వైరల్‌గా మారడంతో సల్మాన్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు.ఇంకొందరు అభిమానులు మా బుట్టబొమ్మకు సల్మాన్‌ను అంటగడతారేంట్రా అంటూ పూజా హెగ్డే ఫ్యాన్స్ మండీ పడ్డారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వార్తలు పై సల్మాన్ ఖాన్ స్నేహితులలో ఒకరు స్పందించారు.సల్మాన్ ఖాన్ స్నేహితుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.

ఇలాంటి బాధ్యతారహితమైన వార్తలు వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుతో తలదించుకోవాలి.పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్‌కు కూతురి లాంటిది.వాళ్లిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే రూమర్లు వ్యాప్తి చేస్తారా? కొంతమంది మూర్ఖులు పబ్లిసిటీ వస్తుందని అనుకోవచ్చు.కానీ ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో జగపతి బాబు, భూమికా చావ్లా, షెహనాజ్ గిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.







