అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హడ్డీ.ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాను జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా2023 లో జీ స్టూడియోస్ లో విడుదల కానుంది.
కాగా హడ్డీ సినిమాలో ట్రాన్స్ జెండర్ లుక్ కోసం నవాజుద్దీన్ చాలా కష్టపడ్డారు.ట్రాన్స్ జెండర్ లుక్ లో కనిపించడం కోసం దాదాపుగా మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించారు నవాజుద్దీన్.
ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటో వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా నవాజుద్దీన్ న్యూ ట్రాన్స్ జెండర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా మేకింగ్ కి సంబంధించిన వీడియోని స్టూడియోస్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.ట్రాన్స్‌జెండర్ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని తెలీపింది.
ఆ వీడియోలో నవాజుద్దీన్ ఒక చైర్ లో కూర్చోగా మేకప్ మెన్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్పీడ్ స్పీడ్ గా మేకప్ చేస్తున్నారు.ఈ ట్రాన్స్ జెండర్ న్యూ లుక్ పై స్పందించిన నవాజుద్దీన్ మాట్లాడుతూ.

ఇది నిపుణుల సమక్షంలో నేను కుర్చీలో దాదాపు మూడు గంటలు కూర్చున్నాను.ఇలా మూడు గంటల పాటు కూర్చోవడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి.ఈ పాత్రను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి కొత్త లుక్ నాకు శక్తినిచ్చింది.దీని పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూసేందుకు నేను ఇక వేచి ఉండలేను అని చెప్పుకొచ్చారు నవాజుద్దీన్.
అయితే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చూసిన నెటిజన్స్ నవాజుద్దీన్ డెడికేషన్ కి మెచ్చుకుంటున్నారు.







