సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటివరకు ఎంతోమంది నటీమణులు ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న ఇనాయ సుల్తానా బిగ్ బాస్ లోకి వెళ్లకుండా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
యాంకర్ గా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన ఇనయ రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ అయ్యారు.ఇక ఈమె పుట్టినరోజు వేడుకలలో భాగంగా వర్మతో కలిసి చేసిన డాన్స్ బాగా పాపులర్ అయింది.
ఇలాంటి పాపులారిటీతోనే ఈమె బిగ్ బాస్ అవకాశం అందుకుంది.బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కి రాకముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్జీవి అంటే తనకు గౌరవం అని ఆయన గొప్ప దర్శకుడుని చెప్పుకొచ్చింది.నటన పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలని ఇంటి నుంచి పారిపోయి వచ్చానని ఈమె తెలిపారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను.కానీ ఇష్టం లేకుండా ఏ పని చేయలేము అందుకే తనకు చాలా ఆఫర్లు వచ్చిన నేను చేయలేదని ఈమె తెలిపారు.ఇక బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉంటుందనుకున్న ఇనయ ఈవారం ఎలిమినేట్ కానుందని వార్తలు వస్తున్నాయి.