Ganta Srinivasa Rao: వైసీపీలో 'గంటా ' చేరితే..?  టీడీపీకి ఎంత నష్టమంటే ? 

వైసిపి ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందని, అది తమకు కలిసి వస్తుందని,  కచ్చితంగా 2024 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని బలంగా నమ్ముతోంది ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం.ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిత్యం ఇదే సందేశాన్ని పార్టీ శ్రేణులకు వినిపిస్తూ, వారిలో ఉత్సాహం పెరిగే విధంగా చేస్తున్నారు.

ఎన్నికల సమయం నాటికి వైసిపి నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, కచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ పదేపదే చెబుతుండగా , ఇప్పుడు టిడిపికి చెందిన ఎమ్మెల్యే , ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచిపట్టున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతుండడం తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేపుతోంది.2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో గంటా ఒకరు.గత ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వేసినా,  విశాఖలో గంటా తన సత్తా చాటుకున్నారు .అయితే ఎన్నికలకు ముందు నుంచి ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా , అది సాధ్యం కాలేదు .ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా అది కూడా సాధ్యం కాలేదు.దీంతో గంటా 2024 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేస్తారని అంత భావిస్తుండగా, ఆయన ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధం చేసుకున్నారు.

డిసెంబర్ ఒకటో తేదీన ఆయన వైసీపీలో అధికారికంగా చేరబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో తన పదవికి రాజీనామా చేశారు .  దానిని స్పీకర్ ఇంకా ఆమోదించలేదు.

ఈలోపే ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతుండడంతో,  ఆయన చేరిక వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో టిడిపికి తీరని నష్టం జరుగుతుందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.కాపు సామాజిక వర్గంలోను మంచి గుర్తింపు ఉండడంతో,  ఎన్నికల సమయంలో కుల సమీకరణాలు లెక్కలు చూసుకున్నా,  గంటా వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుందని టిడిపి టెన్షన్ పడుతోంది.అయితే వైసిపిలో గంటా ఒక్కరే చేరడం లేదని, ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలను వెంట తీసుకువెళ్తున్నారనే వార్తలు మరింత ఆందోళన పెంచుతున్నాయి.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, అప్పలనాయుడు తదితరులతో చర్చించినట్లు సమాచారం.గంట ఏ పార్టీలో చేరితే, ఆయన వెంట వెళ్లేందుకు చాలామంది టీడీపీ కీలక నాయకులు సిద్ధమవుతుండడంతో,  గంటా వెంట వెళ్లేవారు ఎవరెవరు అని విషయంపై టిడిపి ఆరా తీస్తోంది.

Advertisement

   .

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు