Funny Review : ఇతడి తెలివి తెల్లారినట్లుంది.. అమెజాన్‌లో ఎలాంటి కంప్లైంట్ ఇచ్చాడో చూడండి..

ఈరోజుల్లో చాలామంది మొబైల్ ఫోన్స్‌తో పాటు టీవీలు కూడా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు.అవి ఎలా ఉన్నాయో రివ్యూస్ రాసి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

కాగా ఇటీవల ఒక వ్యక్తి అమెజాన్‌లో 50 అంగుళాల టీవీని ఆర్డర్ చేశాడు.అయితే ఇంటికి వచ్చాక అతడు టేపు పెట్టి కొలవగా ఆ టీవీ కేవలం 44 అంగుళాలు మాత్రమే ఉంది.

వెబ్‌సైట్ లో మాత్రం తాను కొన్న టీవీ సైజు 50 అంగుళాలు అని రాసి ఉంది.దాంతో తాను మోసపోయానని సదరు యూజర్ ఒక స్క్రీన్ షాట్ పెట్టి తన గోడును వెల్లబోసుకున్నాడు.

ఈ స్క్రీన్ షాట్ పరిశీలనగా చూస్తే ఒక పెద్ద పొరపాటు కనిపిస్తోంది.అదేంటంటే ఇతడు టీవీ స్క్రీన్ అడ్డంగా కొలిచాడు.

Advertisement

సాధారణంగా ఒక టీవీ సైజును లెఫ్ట్ సైడ్ స్క్రీన్ చివరన, రైట్ సైడ్ పైన టేప్ పెట్టి కొలవాలి.లేదంటే రైట్ సైడ్ చివరన.

లెఫ్ట్ సైడ్ స్క్రీన్ పై భాగంలో టేపు పెట్టి కొలవాలి.అప్పుడే టీవీ స్క్రీన్ అసలైన సైజు తెలుస్తుంది.

అలా కాదని స్క్రీన్ కి నిలువుగా లేదా అడ్డంగా కొలిస్తే వేరే సైజులు వస్తాయి.ఈ విషయం తెలియని సదరు కస్టమర్ ఇదొక "తప్పుడు ప్రకటన" అనే టైటిల్ తో ఒక పెద్ద రివ్యూ రాశాడు.

"అన్‌ప్యాక్ చేసిన తర్వాత నేను కొనుగోలు చేసిన 50 అంగుళాల టీవీ నిజానికి 44 అంగుళాలు మాత్రమే ఉంది. బాక్స్ 49 అంగుళాలు ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

కావాలంటే నేను కొలిచిన ఫొటోలు, వీడియోలు చూడండి.ఇది స్కామ్.

Advertisement

నాకు నా డబ్బులు లేదా 50 అంగుళాల టీవీ కావాలి." అని కస్టమర్ రాశాడు.

ఫొటోను నిశితంగా పరిశీలిస్తే, వ్యక్తిని మోసానికి గురి కాలేదని అర్థం చేసుకోవచ్చు.ఎందుకంటే అతను టీవీ స్క్రీన్‌ను అడ్డంగా కొలుస్తున్నట్లు చిత్రంలో చూపబడింది.

టీవీ స్క్రీన్‌లు ఓన్లీ డయాగ్నల్‌గా కొలుస్తారు.

ఈ రివ్యూ గురించి తెలుసుకున్న నెటిజన్లు ఫన్నీగా నవ్వుకుంటున్నారు.ఈ రివ్యూని 590 హెల్ప్‌ఫుల్ అని రేట్ చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇతడి తెలివి తెల్లారినట్లుంది అసలు ఇలా ఎవరైనా కొలుస్తారా.

ముందు టీవీ స్క్రీన్ ఎలా కొలవాలో తెలుసుకుంటే బాగుంటుంది అని కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు