వాగులపై బ్రిడ్జిల నిర్మాణమే చేయరు:బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ జరిగిందని టీపీసీసీ మేంబర్,ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య ప్రభుత్వంపై మండి పడ్డారు.సోమవారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో వాగును పరిశీలించారు.

 They Don't Build Bridges Over Rivers: Birla Ailaiah-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నుండి సిద్ధిపేటకు వెళ్లే ప్రధాన రహదారి వాగుపై,కొలనుపాక నుండి పటేల్ గూడెం వెళ్ళేదారిలో ఉన్న వాగుపై,కొలనుపాక నుండి బైరం నగర్ వెళ్ళేదారిలో ఉన్న వాగులపై బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.ఈ వాగులపై బ్రిడ్జిలు లేకపోవడంతో వర్షాకాలంలో వాగులు ప్రవహిస్తున్న సందర్భంలో ప్రయాణికులకు ఇరువైపులా ఉన్న ప్రజలకు,స్కూలు విద్యార్థులకు,అత్యవసర వాహనాలకు,చాలా ఇబ్బందికరంగా మారాయని ఇలాంటి వాగులపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు చేయని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి చెందిదని ప్రకటనలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.అనేకమందికి ఆశలు చూపి అది కట్టిస్తా,ఇది కట్టిస్తామని హామీలు ఇచ్చి పార్టీలోకి చేర్చుకుంటున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ వాగులపై శ్రద్ధ ఎందుకు లేదని ప్రశ్నించారు.

అనేక మంది ఈ వాగులో ప్రమాదానికి గురైయ్యారాని,పలువురి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏది ఏమైనా వెంటనే ఈ వాగులపై బ్రిడ్జిలను నిర్మాణం చేయలని డిమాండ్ చేశారు.

లేదంటే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గొట్టం విజేందర్ రేడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు,ఎంపీపీ గంధమల్ల అశోక్,ఉపాధ్యక్షులు వల్లపు పరుశరాములు,వర్కింగ్ ప్రెసిడెంట్ సొంటెం మహేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్,ప్రధాన కార్యదర్శి చాడ రాజు,వార్డు సభ్యులు ఆకుల కరుణారాజు,గాండ్లమట్టం రాజశేఖర్,సీనియర్ నాయకులు చాడ సురేందర్ రెడ్డి, గడ్డమీది రాజు,కారింగుల యాదగిరి,గంధమల్ల రవి, ఎదునూరి భాస్కర్,యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్ అరవింద్ సురేష్ రమేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube