యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు.
కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న అనిరుద్ తారక్ సినిమా కోసం దించుతున్నారు.ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నందుకు గాను అనిరుద్ కి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్.
ఇప్పటికే కొరటాల శివతో అనిరుద్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నారు.ఎన్.టి.ఆర్ 30వ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నందుకు గాను అతనికి దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
తమిళంలో సూపర్ ఫాం కొనసాగిస్తున్న అనిరుద్ తెలుగులో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.విక్రం సినిమాలో అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవల్ లో ఉండేలా చేశాయి.
ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఎన్.టి.ఆర్ 30వ సినిమాకి కూడా అనిరుద్ తన మార్క్ మ్యూజిక్ అందించాలని ఫిక్స్ అయ్యాడు.అనిరుద్, తారక్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఫ్యాన్స్ ని మెప్పించేలా మ్యూజిక్ ఇస్తున్నారట అనిరుద్.
త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీ 2023 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.







