బిగ్ బాస్ సీజన్ 6లో 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది.ఈ నామినేషన్స్ లో కెప్టెన్ ఫైమా కీర్తి తప్ప మిగతా వారంతా కూడా నామినేషన్స్ లో ఉన్నారు.
ప్రస్తుతం హౌస్ లో 9 మంది కంటెస్టంట్స్ ఉన్నారు.వారిలో కెప్టెన్ అయిన కారణంగా రేవంత్ నామినేషన్స్ లో లేడు.
ఇక కీర్తిని కూడా ఈసారి నామినేషన్స్ నుంచి తప్పించారు.ఫైనల్ గా ఉన్న తొమ్మిదిలో మిగిలిన ఏడుగురు శ్రీ సత్య, శ్రీహాన్, ఆది రెడ్డి, ఫైమా, రాజ్, ఇనయా, రోహిత్ లు నామినేషన్స్ లో ఉన్నారు.
మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.
బిగ్ బాస్ సీజన్ 6 లో ఇప్పటికే టాప్ 5 ఎవరిని ఉంచాలా అని ఆడియన్స్ డిక్లేర్ చేశారు.
అయితే టైటిల్ రేసులో మాత్రం రేవంత్ ముందున్నాడు.అతని తర్వాత ఎక్కడో శ్రీహాన్, ఫైమా, ఇనయా, ఆది రెడ్డిలు ఉన్నారు.మరి ప్రస్తుతం ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తుంటే రేవంతే టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.మరి చివరి వారంలో ఏదైనా ఓటింగ్ లెక్క మారుతుందా లేక ఇదే కొనసాగుతుందా అన్నది చూడాలి.







