తెలుగులో ఇటీవలే 21 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 11 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కేవలం 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు.
ఈ తొమ్మిది మందిలో కేవలం ఐదుగురు మాత్రమే ఫినాలే లోకి అడుగుపెట్టి మిగిలిన నలుగురు ఎలిమినేషన్ కానున్నారు.సోమవారం కావడంతో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది.
అయితే ఎప్పటిలాగే సిల్లీ రీజన్ తో నామినేట్ చేస్తాను అంటే కుదరదు అని తెగేసి చెప్పాడు బిగ్ బాస్.ఈ క్రమంలోనే ఒక్కొక్కరినీ కన్వెన్షన్ రూమ్ లోకి పిలిచి నామినేట్ చేయమని చెప్పాడు.
అప్పుడు శ్రీసత్య ఆటతీరును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజ్ మూడు వారాల నుంచి సేవ్ అవుతున్నాడని నామినేట్ చేయడంతో వెంటనే బిగ్ బాస్ తుప్పాస్ రీజన్ కాకుండా ఏదైనా వాలిడ్ పాయింట్ చెప్పమని ఆదేశించడంతో శ్రీ సత్య బిక్కముఖం వేసింది.మరొకవైపు రేవంత్ తన కెప్టెన్సీలో కంటెస్టెంట్లకు కడుపునిండా తిండి దొరక్కుండా చేసి కంటెస్టెంట్లకు కోపం తెప్పిస్తున్నాడు.
గతంలో తన కెప్టెన్సీలో భాగంగా కంటెస్టెంట్లకు అన్నం లేకుండా కడుపు మాడ్చాడు రేవంత్.కంటెస్టెంట్లు అందరూ అన్నమంతా కొద్దిగా వండితే సరిపోవడం లేదు అని ఎంత మొత్తుకున్నా కూడా తన మాటే కరెక్ట్ అన్నట్టుగా కంటెస్టెంట్ ల మాటను పెడ చెవిన పెట్టేస్తున్నాడు.

వారమంతా సరిగా తినకుండా వారాంతంలో మాత్రం కడుపు నిండా పెడతానంటే కరెక్ట్ కాదు రేవంత్ అలా చేయడం వల్ల కెప్టెన్‌గా నువ్వు గెలుస్తావేమో కానీ అందరి ఆకలి తీరదు అని శ్రీ హాన్ కూల్ గా చెప్పినప్పటికీ రేవంత్ మాత్రం తీరుని మార్చుకోలేదు.ఇదే విషయం పట్ల రేవంత్ తో రాజ్,ఫైమా అందరూ వాదించినప్పటికీ రేవంత్ మాత్రం మాటలను కొట్టి పడేస్తున్నాడు.అప్పుడు ఓపిక నశించిన శ్రీహాన్ రేషన్ సేవ్ చేసి మంచి కెప్టెన్ గా నువ్వు పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావ్ కాని ఇక్కడ కంటెస్టెంట్ల కడుపులు నిండాలని ఆదరించడం లేదు అంటూ ఫైర్ అయ్యాడు.







