నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’.ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేయడంతో ఈ నెలలోనే వీలైనంత వరకు షూటింగ్ పూర్తి చేయాలని కష్టపడుతున్నారు టీమ్.
ఈ సినిమా ప్రెజెంట్ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలయ్య కేరీర్ లో 107వ సినిమాగా తెరకెకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి.
ఈ సినిమా కంటే ముందు బాలయ్య అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.దీంతో బాలయ్య ఫుల్ జోష్ లో ఈ సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చాడు థమన్.

” జై బాలయ్య.త్వరలోనే తొడగొట్టి దుమ్ములేపే టైం వచ్చిందిరో” అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసాడు.ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.దీంతో ఫస్ట్ సింగిల్ గా జై బాలయ్య అంటూ సాగే సాంగ్ ను అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు అని హింట్ ఇలా ఇచ్చాడు థమన్.
మరి ఈ సాంగ్ కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి థమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈ సాంగ్ అదిరి పోతుంది అని ముందే అంతా ఫిక్స్ అవుతున్నారు.
చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారో.







