తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో సిట్ అందించిన నోటీసుల్లో గందరగోళం నెలకొంది.సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న నలుగురికి ఒకే నెంబర్ ఉన్న ఫోన్ తేవాలంటూ పేర్కొన్నారు.
అందరికీ ఒకే రకమైన నోటీసును ఇచ్చారని తెలుస్తోంది.బీఎల్ సంతోష్, శ్రీనివాస్ కు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్ ఉన్న ఫోన్ తేవాలంటూ నోటీసుల్లో తెలిపారు.
అయితే 41 ఏ సీఆర్పీసీ నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.అక్రమంగా అరెస్ట్ చేయాలనే సీఆర్పీసీ నోటీసు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.







