తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది నిత్యామీనన్.
ఈమె తెలుగు కన్నడ తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.నిత్యామీనన్ ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే ఎంచుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది.
కాగా మొదట నిత్యామీనన్ అలా మొదలైంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది.
మరి ముఖ్యంగా హీరో ప్రభాస్ వివాదం తనను ఎంతగానో బాధ పెట్టినట్టు చెప్పుకొచ్చింది నిత్యామీనన్.అప్పట్లో ఆ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద వివాదాన్ని సృష్టించినట్లు ఆమె తెలిపింది.
అసలేం జరిగిందంటే.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
నేను సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తెలుగు భాష నాకు సరిగా వచ్చేది కాదు.సాధారణంగా నేను సినిమాలు ఎక్కువగా చూడను.
తమిళ కన్నడ సినిమాలు కూడా తక్కువగా చూసేదాన్ని.అయితే నాకు తెలుగు రాకపోవడంతో తెలుగు సినిమాలు పూర్తిగా చూసేదాన్ని కాదు.
అప్పట్లో నాకు టాలీవుడ్ లో తెలిసిన హీరోలు అంటే చిరంజీవి నాగార్జున వెంకటేష్ అల్లు అర్జున్ మాత్రమే.

ఈ క్రమంలోని తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సందర్భంలో నన్ను మీకు ప్రభాస్ తెలుసా అని ప్రశ్నించినప్పుడు వాస్తవంగా నాకు ప్రభాస్ పెద్దగా తెలియదు దాంతో ఎవరు? తెలియదు అని సమాధానం ఇచ్చాను అని చెప్పుకొచ్చింది నిత్యా మీనన్.అయితే అదే విషయాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని నేను ఏదో పెద్ద తప్పు నేరం చేసినట్లు వార్తలు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పెద్దదిగా చేసి చూపించారు.నా విషయం గురించి అన్ని తెలిసి కూడా నా గురించి ఎలా రాయడంతో నేను చాలా హర్ట్ అయ్యాను.
ఆ ఒక్క వార్తతో ఇండస్ట్రీలో నాకు ఊహించని దెబ్బ తగిలింది.దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్పట్లో నన్ను బాగా ట్రోలింగ్స్ చేసేవారు వ్యతిరేకించేవారు.ఆ విషయాన్ని ఇప్పటికే తలచుకొని నేను బాధపడుతూ ఉంటాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నిత్యామీనన్.ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







