చిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న మారుతి ఇప్పుడు ఒకే సారి ప్రభాస్ తో వందల కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా ని రూపొందిస్తున్న విషయం తెలిసింది.ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది.
ఇప్పటి వరకు సినిమా కు సంబంధించి అధికారికా ప్రకటన రానప్పటికీ ప్రభాస్ చాలా ఆసక్తిగా సినిమా ను చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.డిసెంబర్ మొదటి వారం లో మరో షెడ్యూల్ ఉంటుందని మార్చి వరకు సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే సంవత్సరం లోనే సినిమా ను విడుదల చేయాలని దర్శకుడు మారుతి భావిస్తున్నాడట.
అందుకోసం ఇప్పటికే సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది.
ఒక వైపు ప్రభాస్ సినిమా యొక్క పనులు చూసుకుంటూనే మరో వైపు చిన్న సినిమా లు, వెబ్ సిరీస్ ల యొక్క స్టోరీస్ మరియు స్క్రిప్టు వ్యవహారాల్లో మారుతి తన వంతు సహకారం అందిస్తున్నాడు.
త్వరలో ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఇంటింటి రామాయణం అనే సినిమా కి మారుతి రచన మరియు నిర్మాణ సహకారం అందించినట్లుగా తెలుస్తుంది.ఎస్ నాగ వంశీ సమర్పించు ఇంటింటి రామాయణం సినిమా నిర్మాతల్లో మారుతి ఒకరు అంటూ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా కు మారుతి షాడో డైరెక్టర్ అనే ప్రచారం కూడా జరుగుతుంది.ప్రభాస్ వంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ తో సినిమా చేస్తూ ఇలా చిన్న సినిమా ల నిర్మించడం.దర్శకత్వం వహించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రభాస్ అభిమాను లు అభిప్రాయం చేస్తున్నారు.ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.అతి త్వరలోనే మళ్లీ మారుతి కి డేట్లు ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.







