Sudigali Sudheer Galodu movie : లైగర్ ప్రమోషన్ సీన్ రిపీట్.. మీడియా ముందు సుడిగాలి సుధీర్ కి ప్రపోజ్ చేసిన అమ్మాయి?

తెలుగు బుల్లితెర పేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కమెడియన్ గా,మెజీషియన్ గా, డాన్సర్ గా ఆర్టిస్టుగా ఇలా అన్ని రంగాలలో తనదైన ముద్రణ వేసుకున్నాడు సుడిగాలి సుధీర్.

 Lady Fan Proposes To Sudigali Sudheer Gaalodu Movie , Sudigali Sudheer, Gaalodu-TeluguStop.com

యూత్ లో సుడిగాలి సుధీర్ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడులో కూడా సుధీర్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

జబర్దస్త్ షో ద్వారా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలో ఇన్ని సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్.కాగా పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సుడిగాలి సుధీర్.

ఈ క్రమంలోనే తాజాగా గాలోడు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్న సిప్పి హీరోయిన్ గా నటించింది.తాజాగా నవంబర్ 18 విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో సుధీర్ నటన డాన్స్ ఫైట్స్ అని బాగున్నాయి అంటూ ప్రేక్షకులు.ఇక థియేటర్ల వద్ద అయితే సుధీర్ అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ సందడి సందడి చేశారు.

ఈ నేపథ్యంలోనే గాలోడు సినిమాను చూసిన ఒక యువతి సుధీర్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసింది.ఆ యువతి మాట్లాడుతూ ఈ సినిమాలో సుధీర్ ను చాలా బాగా చూపించారు.

డాన్స్ ఫైట్స్ తో సుధీర్ అదరగొట్టాడు.గత సినిమా సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా కంటే ఈ సినిమా చాలా బాగుంది అని తెలిపింది ఆ యువతీ.ఇకంలో సుధీర్ మీ వద్దకు వస్తే ఏం చేస్తారు అని మీడియా వాళ్ళు అడగగా ఐ లవ్ యు సుధీర్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తానని, వీలైతే ఒక హగ్గు కూడా ఇస్తాను అని చెప్పుకొచ్చింది సదరు యువతి.ఎందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.facebook.com/watch/?ref=external&v=6228354803859480
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube