తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో నందమూరి నట సింహం బాలకృష్ణతో ఎంతో మంచి అనుబంధం ఏర్పరుచుకున్నారు.ఇలా బాలయ్యతో మంచి అనుబంధం ఏర్పడడంతో గీత ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణతో తప్పకుండా సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు.
ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.
ఇకపోతే గీత ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ పరశురామ్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ క్రమంలోనే మరోసారి గీత ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.
ఇలా పరశురాం ఒక కథను అలాగే కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నవెంకటేష్ మహా దర్శకత్వంలో కూడా బాలకృష్ణ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇలా వీరిద్దరూ బాలయ్యకు స్టోరీ లైన్ వినిపించడంతో బాలకృష్ణ పరుశురాం కాకుండా వెంకటేష్ మహా చెప్పిన స్టోరీ లైన్ కు ఫిదా అయ్యారట.
ఈయన చెప్పిన సినిమా కథలు మన నిజ జీవితానికి ఆధారంగా ఉండడంతో బాలయ్య ఈయనకే ఓటు వేసినట్టు తెలుస్తుంది.

పరశురాం దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా సినిమా చేయాలని భావించినప్పటికీ బాలకృష్ణ మాత్రం వెంకటేష్ మహా చెప్పిన స్టోరీకి ఫిదా కావడంతో ఆయనతో సినిమా చేయాలని భావించారట ఇలా బాలయ్య నిర్ణయంతో అల్లుఅరవింద్ కి ఒకింత షాక్ తగిలిందని చెప్పాలి.ఇక వెంకటేష్ మహా దర్శకత్వంలో చేయబోయే చిత్రాన్ని వారాహి బ్యానర్లో చేయబోతున్నారని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని ఫిలిం సర్కిల్లో ఈ వార్త చెక్కర్లు కొడుతోంది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.







