హైదరాబాద్ నిజాం కాలేజీ విద్యార్థినీలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు విఫలమైయ్యాయి.ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం మరోసారి చర్చలకు రావాలని విద్యార్థినీలను మంత్రి సబితా ఆహ్వానించారు.
మంత్రి చెప్పిన డిమాండ్స్ లో కొన్నింటికి విద్యార్థులు ఆమోదం తెలిపారు.మరోవైపు కొత్తగా నిర్మాణం చేపట్టిన భవనంలో యాభై శాతం డిగ్రీ విద్యార్థులకు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అదేవిధంగా మరో ఆరు నెలల్లో మరో ఫ్లోర్ నిర్మాణం చేపట్టి ఇస్తామని తెలిపారు.అప్పటివరకు విద్యార్థులు హాస్టల్ లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
అయితే డిమాండ్లలో స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.







