Samantha Yashoda First Review: యశోద ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సమంత సింపతి వర్కౌట్ అయ్యేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన సినిమా యశోద.హరి శంకర్, హరీష్ నారాయన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Samantha Yashoda Movie First Review Details, Yashoda, Samantha, Samantha Yashoda-TeluguStop.com

భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.యాక్షన్ అండ్ త్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలకపాత్రలో నటించారు.ఇక పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.

ఇక ఇప్పటికే థియేటర్ల దగ్గర ఈ సినిమా విడుదల సందర్భంగా పెద్దపెద్ద బ్యానర్లతో ఘనంగా ఏర్పాట్లు చేశారు సమంత అభిమానులు. కానీ మరోవైపు సమంత మాత్రం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సినిమా ప్రమోషన్స్ లో మాత్రం యాక్టివ్ గా పాల్గొంటుంది.మరోవైపు సినిమా విడుదలకు దగ్గరవుతున్న కొద్ది సమంతపై మరింత సింపతి పెరిగింది.

Telugu Hari Harish, Murali Sharma, Rao Ramesh, Samantha, Samanthayashoda, Yashod

అయితే ఇదంతా పక్కన పెడితే.తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.ఇటీవల ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.దీంతో సినిమా సెన్సార్ చూసిన సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చినట్లు తెలిసింది.ఇటువంటి డిఫరెంట్ కథతో సినిమా రావటం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు.ఇక యాక్షన్ సీన్స్ మాత్రం హైలెట్ అని.సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలిసింది.

Telugu Hari Harish, Murali Sharma, Rao Ramesh, Samantha, Samanthayashoda, Yashod

అంతేకాకుండా సినిమాలో ఎంచుకున్న కథనం కూడా అద్భుతంగా ఉంది అని.ఎలాగైనా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంటుందని తెలుస్తుంది.ఇక ఈ రివ్యూ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఈ రివ్యూ మాత్రం సమంత అభిమానులను బాగా సంతోష పెడుతుంది.

ఇక రేపు ఈ సినిమా ఎటువంటి హిట్ టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.ప్రస్తుతం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంతకు ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చి పెడుతుందని తెలుస్తుంది.

Telugu Hari Harish, Murali Sharma, Rao Ramesh, Samantha, Samanthayashoda, Yashod

ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి సమంతా తన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.దీంతో ఈ పరంగా ఆమెకి సింపతి కూడా వచ్చింది.అందుకు ప్రేక్షకులు సమంత సినిమా చూడటం కోసం బాగా ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.ఇక ఇదంతా చూస్తే సింపతి పరంగా సమంతకు బాగా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube