పేదవారి కోసం పెట్టిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.పేదరికం పోయే వరకు టీడీపీ పని చేస్తోందని చెప్పారు.
దేశంలో రాజకీయాలకు నూతన అర్థాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు.ఆ రోజుల్లోనే రూ.2 కే కిలో బియ్యం ఇచ్చారని, అధికార వికేంద్రీకరణకు నాంది పలికింది ఎన్టీఆర్ అని అన్నారు.2009లో తెలంగాణ గడ్డపై ఎక్కువ సీట్లు గెలిచింది టీడీపీనేనని వెల్లడించారు.తెలంగాణలో ఒక శక్తిగా టీడీపీని తయారు చేయాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఇది ప్రారంభం మాత్రమేనని.భవిష్యత్ అంతా టీడీపీదేనని తెలిపారు.







