అమెరికా ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్.ఈ వారం ప్రారంభంలో ఓహియోలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన పెలోసీని ‘‘ఒక జంతువు’’ అంటూ వ్యాఖ్యానించారు.
తన తప్పు ఏమి లేనప్పటికీ రెండు సార్లు అభిశంసన ఎదుర్కోవడం వెనుక పెలోసీ వుందని ట్రంప్ ఎప్పటి నుంచో గుర్రుగా వున్నారు.అందుకే తాను ఆమెను జంతువుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.
ఒక టీనేజ్ బాలుడిని ప్లే గ్రౌండ్‌కి రప్పించి.బేస్‌బాల్ బ్యాట్‌తో అతని తలపై కొట్టడం, 32 సార్లు దారుణంగా పొడిచి పొడిచి చంపడం వల్ల ఎంఎస్ 13 అనే ముఠా సభ్యుడు శిక్షించబడ్డాడని.
అతను జంతువని ట్రంప్ అన్నారు.కానీ వారిని జంతువులు అని పిలవొద్దని.వాళ్లు మనుషులేనని పెలోసీ అన్నారని ఆయన గుర్తుచేశారు.నిజం చెప్పాలంటే పెలోసి కూడా ఒక జంతువు అని తాను అనుకుంటున్నానని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికన్ రాజకీయాల్లో కీలక వ్యక్తులైన డొనాల్డ్ ట్రంప్, నాన్సీ పెలోసీల మధ్య సుదీర్ఘ కాలంగా మంచి సంబంధాలే వున్నాయి.అయితే క్యాపిటల్ అల్లర్ల తర్వాత వీరిద్దరికి గ్యాప్ వచ్చింది.
ఆ సమయంలో ట్రంప్‌ను కొట్టి జైలుకు వెళ్తానని నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

మరోవైపు… అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ట్రంప్ భావిస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా వచ్చే వారం తానో కీలక ప్రకటన చేస్తానని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.ఇది అధ్యక్ష ఎన్నికల గురించేనని అమెరికన్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది.మరి అదేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.2016 రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు.తర్వాత 2020లో రెండోసారి పోటీ చేయగా.జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు.







