పూజ హెగ్డే( Pooja Hegde ) … తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిన్న మొన్నటి వరకు బుట్ట బొమ్మగా చాలా పాపులర్.కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమి బాగోలేదు.
ఆమె నటిస్తున్న ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఉండడం వల్ల కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది పూజ.అందుకే ఆమె చేతుల దాకా వచ్చిన ప్రాజెక్టులు దూరం అవుతున్నాయి.అంతే కాదు ఇప్పుడు ఏకంగా ఆమె కమిట్ అయ్యి అడ్వాన్స్ తీసుకున్న సినిమాల నుంచి కూడా తప్పించ బడుతుంది.దాంతో పూజ హెగ్డే కెరియర్ డేంజర్ జోన్ లోకి వెళ్లడం మాత్రమే కాదు ఆమె అభిమానులు అంతా కూడా పూజకి రావలసిన అవకాశాలు కొంతమంది హీరోయిన్స్ కావాలని లాక్కుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు.

త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం అనే సినిమాలో మొదట పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఆమెకు అడ్వాన్స్ కూడా వెళ్ళిపోయింది కానీ పూజ హెగ్డే పై ఉన్న అభిమానంతో త్రివిక్రమ్ తీసుకున్నా కూడా మహేష్ బాబుకు ఫ్లాప్ హీరోయిన్ వద్దు అనే ఫీలింగ్ ఉండడంతో మహేష్ కోసమే త్రివిక్రమ్ ఆమెను తప్పించి సంయుక్త మీనన్ ( Samyukta Menon )నీ ఈ సినిమా కోసం పెట్టారట.పూజ కెరియర్ కు ప్రస్తుతం సంయుక్త మీనన్ మాత్రమే కాదు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా శని గ్రహంలో తయారయ్యారు అనేది పూజ అభిమానుల వాదన.

హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సైతం పవన్ సరసన మొదట పూజా ని హీరోయిన్ గా అనుకున్నారట.కానీ రాత్రి ఏమైందో తెలియదు ఆమె స్థానంలో శ్రీ లీల( Sri Leela ) వచ్చి చేరింది.అంతే కాదు మొన్న శ్రీ లీల పుట్టిన రోజున హరీష్ శంకర్ టీం శ్రీ లీల బర్త్ డే విషెస్ కూడా చెప్పారు.
ఇక ఇప్పటికే జనగణమన అనే సినిమా నుంచి పూజా హెగ్డే తప్పకుండా విషయం కూడా మనకు తెలిసింది ఈ చిత్రంలో ఆమె స్థానంలో మృనాల్ ఠాకూర్( Mrinal Thakur ) వచ్చి చేరింది.ఇలా రకరకాల కారణాల వల్ల ఆమె స్థానంలో సంయుక్త, శ్రీ లీల, మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్లు వచ్చి చేరుతున్నారు.