దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది.ఢిల్లీలో రెండు సార్లు భూమి కంపించింది.రిక్టర్ స్కేల్ పై తీవ్రత మొదటి సారి 5.7, రెండో సారి 4.9గా నమోదైంది.కాగా సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.
ఉత్తరాఖండ్ పితోరాఘర్ కు ఆగ్నేయంగా 90 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది.నేపాల్ లో భూకంపం సంభవించడంతో ఢిల్లీలోనూ భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
నేపాల్ లో నిన్న రాత్రి మొత్తం మూడు సార్లు భూమి కంపించడంతో దోతి జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడినట్లు సమాచారం.







