తల్లులు తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు.తమ పిల్లలను సంరక్షించడానికి తల్లులు తమ ప్రాణాలను కూడా వదిలేసేందుకు సిద్ధమవుతారు.
అందుకే తల్లి ప్రేమ ఎంతో గొప్పదని అంటుంటారు.ఈ మాట కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది.
ఇప్పటికే ఎన్నో జంతువులు తమ పిల్లలను రక్షిస్తూ కెమెరాకి చిక్కాయి.కాగా తాజాగా ఒక తల్లి ఎలుక వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో కుండపోత వర్షం నుంచి ఎలుక తన పిల్లలను రక్షించడం కనిపించింది.ఈ హార్ట్ టచింగ్ వీడియోను ట్విట్టర్‌లో ఫ్యాసినేటింగ్ అనే అకౌంట్ షేర్ చేసింది.“ఒక ఎలుక తన పిల్లలను కుండపోత వర్షం నుంచి కాపాడుతుంది” అని ఒక క్యాప్షన్ కూడా జోడించింది.
2 నిమిషాల 20-సెకన్ల వీడియోలో భారీ వర్షం కురుస్తుండటం చూడవచ్చు.అప్పుడే ఒక కలుగులో నుంచి ఎలుక బయటికి వచ్చింది.వర్షం కారణంగా ఆ కలుగులోకి నీరంతా వెళ్తోంది.దాంతో తన కలుగు మొత్తం నిండి పోయిందని తన పిల్లలను బతికించుకోవాలని ఆ ఎలుక భావించింది.అందుకే పెద్ద వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా తన పిల్లలను కలుగులో నుంచి బయటికి తీసుకురావడం ప్రారంభించింది.
ఆ ఎలుక చాలా వేగంగా బొక్కలోకి వెళ్తూ తన పిల్లలను బయటకు తీసుకొస్తూ కనిపించింది.
ఎలుక తన అన్ని పిల్లలను నోటిలో పెట్టుకుని.ఒక ఇంటి మెట్లపైకి దూసుకుపోతూ వాటిని వర్షానికి దూరంగా ఒక మూలన సురక్షితమైన ప్రదేశంలో ఉంచింది.నీటిలో మునిగిపోతున్న తన పిల్లలను రక్షించడానికి తల్లి ఎలుక చేసిన ప్రయత్నం నెటిజన్లను ఫిదా చేసింది.
“తల్లి ప్రేమకు అవధులు లేవు” అని నెటిజన్లు ఈ తల్లి ఎలుకని ప్రశంసించారు.ఈ బ్యూటిఫుల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.