నేటి తరానికి పరిచయం లేని నటుడు చిత్తూరు వి నాగయ్య.నాటి రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా నడుస్తున్న కాలంలో నాగయ్య కోసం దర్శకులు, నిర్మాతలు బ్రహ్మరథం పట్టేవారు.
ఎంతో ఆస్తి ఉన్న ఎంత మంచి పేరున్నా ఆయనకు ఒక వెలితి ఎప్పుడూ ఉండేది.అదేంటంటే ఆయనకు పిల్లలు లేరు.
అందుకే ఆయనపై ఎంతో ప్రేమాభిమానాలు కలిగినటువంటి సీనియర్ హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్ ని చిత్తూరు నాగయ్య తన సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునేవారట.అందుకే వారు సైతం నాగయ్యని నాన్నగారు అంటూ ఎంతో మర్యాదపూర్వకంగా పిలుచుకునేవారు.
నాగయ్య ఒక సామాన్య నటుడు అయితే ఆయన గురించి ఇంత చర్చ ఉండేది కాదు.
ఆయన ఒక దర్శకుడు, సంగీత దర్శకుడు.
తక్కువ ఖర్చుతో సినిమాలు తీయడంలో నాగయ్య మంచి నేర్పరి.ఖర్చులు తగ్గించుకొని, ఎన్ని కష్టాలు పడినా సరే సినిమా చేస్తేనే మంచిది అంటూ చిత్తూరు నాగయ్య ఎప్పుడు చెబుతూ ఉండేవారు.
అందుకే వీలైనంత పొదుపుగా సినిమాలు తీస్తూ అంతకన్నా మంచి వసూల్లను సాధించేవారు.మేఘన అనే సినిమాలో నాగయ్య హీరో వేషం వేశారు.
ఆ సమయంలో అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీస్ లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది.అంటే అప్పట్లో నాగయ్య కున్న క్రేజ్ అలాంటిది.
దాదాపుగా అప్పుడున్న హీరోలందరిలో నాగయ్య రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేది.
అయితే చాలామందికి ఉన్నట్టే నాగయ్య కి కూడా ఒక వీక్నెస్ ఉండేది.అది కార్లు.ఏది బాగుంటే, ఏది కొత్తగా వస్తే మార్కెట్లోకి వస్తే ఆ కారు కొనేవారు.
అంతేకాదు ఆ కారులో తన తోటి నటి నటులను అందర్నీ ఎక్కించుకొని హోటల్ కి వెళ్లి పార్టీలు చేసుకునేవారు.ఇక మరొక విషయం ఏంటంటే దానం చేయడం.
తన దగ్గరికి వచ్చేవారికి లేదనకుండా ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపేయడం ఆయనకు అలవాటు.తన పుట్టిన ప్రాంతం నుంచి చెన్నైకి ఎవరొచ్చినా సరే సినిమా అవకాశాల కోసం కష్టపడడం పడకూడదని ఇంట్లోనే పెట్టుకునేవారు.
వారికి కావాల్సిన అన్ని సమకూర్చేవారు.ఇలా నాగయ్య దయవల్ల చాలామంది ఆ తర్వాత కాలంలో హీరోలయ్యారు.అలాంటి వారిలో శోభన్ బాబు కూడా ఉన్నాడు.ఇలా నాగయ్య కున్న మంచి అలవాట్లు, దానధర్మాలు ఆ తర్వాత కాలంలో ఆయన్ని రోడ్డు మీదికి లాగి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిని తీసుకొచ్చాయి.
ఈ విషయంపై అక్కినేని, ఎన్టీఆర్ ఎన్నోసార్లు డబ్బులు వృధా చేయకండి, డబ్బులు కాపాడుకోండి అంటూ హెచ్చరించేవారట.అయన కూడా విని వదిలేసేవారట.
చివరికి నాగయ్య చనిపోయాక అంత్యక్రియలకు కూడా డబ్బు లేని పరిస్థితి ఉంటే ఎన్టీఆర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారట.