Telangana Liquor Sales : తెలంగాణలో రికార్డు స్థాయిలో మధ్యం అమ్మకాలు.. అక్కడే అత్యధికం!

మానుగూడు ఉప ఎన్నికలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి.డబ్బు, మద్యం ఏరులై పారింది.

 Record Sales In Telangana.. Highest There! Munugodu ,liquor Sales, Bipoll Schedu-TeluguStop.com

ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో మద్యం, మాంసం విక్రయాలు జరిగాయి.తాజా నివేదికల ప్రకారం, అక్టోబర్ నెలలో తెలంగాణ మొత్తం రూ.3007 కోట్ల మద్యం విక్రయాలను నమోదు చేసింది.రాష్ట్రవ్యాప్తంగా జరిగిన విక్రయాల్లో ఒక్క మునుగోడు నియోజకవర్గం వాటా 10%గా ఉంది.

తెలంగాణ రాష్ట్రం మొత్తం అమ్మకాలలో 1/10వ వంతు అక్టోబరు నెలలో ఒక్క మునుగోడులోనే రూ.300 కోట్ల విలువైన మద్యం విక్రయించారు.ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పుడు ఎన్నిక జరిగే వరకు నెల రోజుల సమయంలో దాదాపు రూ.300 కోట్ల మద్యాన్ని వినియోగించారు.పక్క జిల్లాల నుండి పెద్ద ఎత్తున మద్యం మునుగోడుకు సరఫరా అయింది.సెప్టెంబర్ నెలలో రూ.2,700 కోట్ల మద్యం సేల్ అవ్వగా అక్టోబర్‌​నెలలో 40 % పెరిగి రూ.3,037 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ లెక్కల్లో వెల్లడైంది.దాదాపుగా రూ.300 కోట్ల అమ్మకాలు జరిగాయి.

Telugu Bipoll Schedule, Hyderabad, Liquor, Munugodu, Naglonda, Telengana, Trs-Po

ఇక తెలంగాణలో పెరిగిన మధ్యం అమ్మకాలను చూస్తే.అక్టోబర్‌లో హైదరాబాద్ రూ.345 కోట్ల, నల్గొండలో రూ.32 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.59 కోట్లు, కరీంనగర్​లో రూ.50 కోట్లు, మేడ్చల్​మల్కాజ్​గిరిలో రూ.21 కోట్లు, మహబూబ్​నగర్​లో రూ.16 కోట్ల మధ్యం అమ్మకాలు జరిగాయి.ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీలు అన్ని మద్యం ఓటర్లకు సరఫరా చేశారు.రేపు నవంబర్ 6వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియతో మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠకు తెరపడనుంది.

ఎగ్జిట్ పోల్ సర్వేల విషయానికొస్తే.అన్ని ప్రముఖ పోర్టల్స్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని అంచనా వేసింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube