కంటి నిండా నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు, స్ట్రెస్, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం, డిప్రెషన్ తదితర కారణాల వల్ల కళ్ల కింద నలుపు ఏర్పడుతుంది.ఈ నలుపు ఒక్కసారి వచ్చిందంటే ఓ పట్టాన పోనే పోదు.
దాంతో కళ్ళ కింద నలుపును వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఖరీదైన క్రీములు, సీరంలు వాడుతుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే కనుక వారంటే వారం రోజుల్లోనే కళ్ళ కింద నలుపు మాయం అవుతుంది.మరియు ముడతలు ఏమన్నా ఉన్నా సరే క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
మరి ఇంతకీ కళ్ళ కింద నలుపును దూరం చేసే ఆ చిట్కా ఏమిటి అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బేబీ ఆయిల్ ను వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలను వేసుకోవాలి.ఇక చివరిగా వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి స్పూన్ సహాయంతో అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో కాటన్ ప్యాడ్ ను ముంచి కళ్ళ కింద పెట్టుకోవాలి.
పది నుంచి పదిహేను నిమిషాల పాటు కాటన్ ప్యాడ్ ను ఉంచుకుని ఆపై చల్లటి నీటితో శుభ్రంగా కళ్ళను క్లీన్ చేసుకోవాలి.ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం ఈ విధంగా చేస్తే చాలా తక్కువ సమయంలోనే కళ్ళ కింద నలుపు మాయం అవుతుంది.అదే సమయంలో కళ్ళ కింద ముడతలు ఏమైనా ఉన్నా క్రమంగా తగ్గుతాయి.
కాబట్టి కళ్ళ కింద నలుపు మరియు ముడతల సమస్యతో సతమతం అయ్యే వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.