ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై ఈనెల 10వ తేదీన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.అయితే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న విషయం తెలిసిందే.

రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది.పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానాతో పాటు యూపీ రైతులు పంట వ్యర్థాలను కాలుస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తుంది.

దీని కారణంగా గాలి నాణ్యత అత్యంత కనిష్టానికి పడిపోయింది.దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు