T20 వరల్డ్ కప్ 22లో భాగంగా నిన్న గురువారం పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై జింబాబ్వే ఘనవిజయం సాధించిన సంగతి విదితమే.మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది.
ఆ తరువాత బౌలింగ్‌లో పాక్ ప్లేయర్లను కట్టడి చేసి కేవలం ఒకే ఒక్క పరుగుతో విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది.కాగా ఈ ఓటమి తర్వాత పాక్‌పై ఎన్నడూ లేని విధంగా ట్విట్టర్‌లో ట్రోల్స్, మీమ్స్ రావడం కొసమెరుపు.
దీనికి కారణం ఫేక్ మిస్టర్ బీన్ (రోవాన్ అట్కిన్సన్) అని చెప్పవచ్చు.
ఆఖరికి జొమాటో కంపెనీ కూడా ఈ బీన్ పేరు వాడుతూ పాక్‌ని ట్రోల్ చేయడం కొసమెరుపు.
అసలు ఈ మ్యాచ్‌కి, ఫేక్ మిస్టర్ బీన్‌కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? కాస్త వెనక్కి వెళితే 2016లో హరారే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌కు పాకిస్థానీ హాస్యనటుడు అయినటువంటి ఆసిఫ్ మొహమ్మద్ వెళ్లడం జరిగింది.కాగా ఇతడు మిస్టర్ బీన్‌ను పోలి ఉండటం గమనార్హం.
అతన్ని ‘పాకిస్థానీ మిస్టర్ బీన్’ అని తమ అభిమానులు పిలుస్తుంటారు.అయితే, ఒక్కో జింబాబ్వే వ్యక్తి 10 డాలర్లు వెచ్చించి ఇతన్ని చూసేందుకు, ఇతడి కామెడీ ని ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, ఈ షో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ అతని కామెడీ చూసే బాగా నవ్వుకున్నామని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం అప్పట్లో పెద్ద దుమారాన్ని సృష్టించింది.అలాగే కొందరు పాక్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.ఫేక్ మిస్టర్ బీన్‌ని పంపించి తమను దారుణంగా మోసం చేశారంటూ కొందరు ఫైర్ అయ్యారు.కాగా అప్పుడు పాక్ మోసం చేయడానికి గుర్తు చేసుకుంటూ ఈ మ్యాచ్‌కు ముందు ఒక ట్విట్టర్ యూజర్ శాపం పెట్టారు.“జింబాబ్వే ప్రజలుగా మేం మిమ్మల్ని క్షమించం.ఎందుకంటే మీరు ఒకసారి మాకు మిస్టర్ బీన్ బదులుగా ఆ ఫ్రాడ్ పాక్ బీన్ ఇచ్చారు.రేపు ఈ విషయం సెటిల్ చేస్తాం.” అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.దానికి తగ్గట్టే పాక్ ఓడిపోవడం బాధాకరం.







