దేశవ్యాప్తంగా అక్టోబర్ 24వ తేదీ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ దీపావళి పండుగ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్ మహాలక్ష్మి దంపతుల సైతం దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తోంది.వీరిద్దరి వివాహం తర్వాత మొదటిసారి వచ్చిన పండుగ కావడంతో ఈ దంపతులు ఎంతో ఘనంగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మహాలక్ష్మి రవీందర్ గత నెల రోజుల క్రితం ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.అయితే వీరి వివాహం ద్వారా వీరిద్దరూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఈ పెళ్లికి ముందే వీరిద్దరూ పెళ్లి చేసుకుని వారి భాగస్వాములతో విడాకులు తీసుకొని విడిపోగా అనంతరం ఈ దంపతులు వివాహ బంధంతో ఒకటయ్యారు.అధిక శరీర బరువు ఉన్నటువంటి రవీందర్ ను మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నట్టు అప్పట్లో పెద్ద ఎత్తున వీరు పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను రవీందర్ పూర్తిగా ఖండించారు.

ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ దంపతులు వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే దీపావళి పండుగకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా అభిమానులతో పంచుకోవడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.ఇందులో రవీందర్ సాంప్రదాయంగా పట్టు పంచ ధరించగా మహాలక్ష్మి చుడీదార్ ధరించి ఎంతో అందంగా ఉన్నారు.
ఇలా వీరిద్దరూ టపాకులు కాలుస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.







