యాదాద్రి లొ టీ ఆర్ స్ శ్రేణులు భారీ నిరసన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాకకు వ్యతిరేకంగా యాదగిరిట్టలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన వ్యక్తంచేశారు.బండి సంజయ్‌, రఘునందన్‌ రావు దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు.

 Trs Ranks In Massive Protest At Yadadri-TeluguStop.com

అనంతరం ప్రధాన కూడలి వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసి గో బ్యాక్ బండి అంటూ నినాదాలు చేశారు.చేశారు.

బండి సంజయ్‌ యాదాద్రి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వక్యం చేశారు.స్వాములతో దొంగ పనులు చేయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ నాయకులు యాదాద్రి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తామనడం సిగ్గు చెటన్నారు.

దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోదీ యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు.అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని దుయ్యబట్టారు.

మహారాష్ట్ర, కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయలేదని యాదాద్రీశుని పాదాల వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube