టాలీవుడ్ అందగాడుపై కన్నేసిన ఊర్వశి రౌతెల్లా... RP అంటే రిషబ్ పంత్ కాదట, ఎవరో తెలుసా?

బాలీవుడ్ సెక్సీ బాంబ్ ఊర్వశి రౌతెల్లా గురించి కుర్రాళ్లకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు.ఈ అమ్మడు నటనతో కాకుండా తన అందం అనే ఆయుధంతో అవకాశాలు పొందుతూ ఉంటుంది.

 Urvashi Rautella Eyes On Tollywood Handsome-TeluguStop.com

ఈ క్రమంలో ఊపిరి సలపని విధంగా సినిమా అవకాశాలను కొల్లగొడుతుంది.ఒక్క బాలీవుడ్లోనే కాకుండా యావత్ సౌత్ భాషల్లో కూడా నర్తిస్తూ మెప్పిస్తోంది.

ఓ వైపు సోషల్ మీడియాని కూడా వదలదు.హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేసి, కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది.

అయితే ఈమధ్యకాలంలో అయితే ఆమె ‘RP’ అనే పేరుతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసిన సంగతి తెలిసినదే.

సరిగ్గా నెల రోజుల క్రితం తనను కలవడానికి ‘Mr.RP’ వచ్చాడని ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి చేసిన కామెంట్లు పెను దుమారాన్నే సృష్టించాయి.ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ… “నా కోసం మిస్టర్ RP, వారణాసికి వచ్చేసాడు.

నేను కలవలేకపోయాను, ఎందుకంటే ఆరోజు నేను షూటింగ్ చేసి బాగా అలసిపోయాను.హోటల్ రూమ్‌కొచ్చి అలాగే నిద్రపోయాను.

మొబైల్ సైలెంట్ లో పెట్టేసాను.దాంతో మిస్టర్ RP ఫోన్ ఎత్తలేకపోయాను.

దాంతో అతను నామీద అలిగాడు!” అంటూ ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది బాలీవుడ్ బాంబ్ ఊర్వశి రౌతెల్లా.

Telugu Ram Pothinenini, Latest, Rishab Panth, Rishabh Pant, Tollywood, Urvashi-L

ఇకపోతే ఆ మాటలు క్రికెటర్ రిషబ్ పంత్ కి కాకుండా టాలీవుడ్ హీరో రామ్ పోతినేనిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.ఎందుకంటే, వీరి ఇద్దరు కలిసి బోయపాటి దర్శకత్వంలో ఓ సాంగ్ లో నర్తిస్తున్నారు.ఈ క్రమంలో వీరు ఈమధ్య ఓ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి విదితమే.

ఇకపోతే సదరు విషయంలో అప్పుడు క్రికెటర్ రిషబ్ పంత్ “నన్ను వదిలేయి అక్కో” అని అనడం, దానికి ఊర్వశి రౌతెల్లా… “బ్యాటు బాల్ ఆట చూసుకో తమ్ముడూ, నీగురించి కాదు!” అనడం తెలిసినదే కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube