భారతీయ విద్యావ్యవస్థ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు.నానాటికీ ఇక్కడ విద్య ప్రమాణాలు పడిపోతున్నాయి.
కళాశాలలు విద్యార్థులను ఓ రోబోట్ మాదిరి తయారుచేస్తున్నాయి.నాణ్యమైన చదువులు లభించడంలేదు.
ఈ క్రమంలో కొన్ని కార్పొరేట్ స్కూల్స్ విద్యను ఓ మంచి వ్యాపారంలాగా తయారుచేశాయి.ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి సీట్లకు ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పాల్సినపనిలేదు.
సిటీలో పేరున్న పాఠశాలల్లో ఫీజు ఎక్కువగా ఉన్నా.తల్లిదండ్రలు క్వాలిటీ ఎడ్యూకేషన్ కొరకు ఆ స్కూళ్లకే తమ పిల్లల్ని పంపిస్తున్నారు.
కాస్త పేరున్న స్కూల్స్ కి వున్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.అలాంటివాటిలో అడ్మిషన్ దొరకాలంటే కత్తిమీద సామే అన్న మాదిరి తయారైంది పరిస్థితి.
అవును, తాజాగా ఓ స్కూళ్ల వద్ద LKG సీట్ల కోసం తల్లిదండ్రులు బారులు తీరారు.అది కూడా ఉదయం 3 గంటల నుంచి.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లోని St.Ann’s School వద్ద తమ పిల్లల LKG సీట్ల కోసం ఉదయం 3 గంటల నుంచి క్యూ కట్టడం సదరు వీడియోలో మనం చూడవచ్చు.

ఎముకలు కొరికే చలిలో కూడా వాళ్లు క్యూలో నిల్చుకొవడం చూస్తే ఔరా అనిపించక మానదు.తమ పిల్లల అడ్మిషన్స్ కోసం తల్లిదండ్రులు ఇంతలా బారులు తీరడంతో.నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇక LKG చదువుకే ఇంత డిమాండ్ ఉంటే.పై చదువులకు తమ పిల్లలను చదివించాలంటే.
ఇంకెంత కష్టమౌతుందో అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే నాణ్యమైన విద్య అనేది కేవలం ప్రైవేట్ కళశాలలోనే కాదు కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో కూడా లభిస్తున్నాయి కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.







