ఈరోజు ఉదయం స్వామి వారి అభిషేక సేవలో దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ గారు దర్శించుకున్నారు.ఆలయ అధికారులు మహద్వారం గడ ఆయనకు స్వాగతం పలికారు.
దర్శనం చేసుకున్న అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాలినడకన తిరుమలకు వచ్చే స్వామివారిని దర్శించుకుంటానని సంకల్పం చేసుకున్నానని ఈరోజు నెరవేర్చడం జరిగిందని తెలిపారు.
కోరిన కోరికలన్నీ స్వామివారు నెరవేర్చారని ఆయనకు ఎల్లవేళలా అనుగ్రహం ఉండాలని గత మూడు సంవత్సరాల నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన తెలిపారు.ఈ మూడు సంవత్సరంలో అనేక వంతురాలు ఎదుర్కొన్నామని కరోనా వంటి ప్రధాన సమస్యను కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా సముద్రమంతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అది స్వామివారి దయ తోనే జరుగుతుందని మరింత శక్తిని ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు.