రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.బీజేపీపై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ విమర్శిస్తోంది.
అయితే ఈ వ్యవహారంపై బీజేపీ హైకమాండ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.టీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించినట్లు సమాచారం.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పార్టీ నేతలు ప్రధాని మోడీని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తూ.వారి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు.
ఇలాంటి చర్యలపై కేంద్రం ఉపేక్షించేది లేదని భావిస్తోంది.ఇలాంటి ఘటనలకు చోటివ్వకుండా చూసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించింది.టీఆర్‌ఎస్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలో హాట్ టాపిక్‌గా ‘కొనుగోళ్ల వ్యవహారం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది.ఈ విషయంపై గురువారం ఢిల్లీలో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది.టీఆర్ఎస్‌కు సంబంధం లేని విషయంలోకి బీజేపీని లాగుతోందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, ఇతర ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.అలాగే ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపేందుకు బీజేపీ.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.ఒక వేళ అలా కుదరకపోతే కోర్టులో ఫిర్యాదు చేసి జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా ప్లాన్ చేస్తోంది.

హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర బీజేపీ నేతలు
పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం హైకోర్టును ఆశ్రయించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఈ క్రమంలో బీజేపీ చాలా సీరియస్‌గా ఉంది.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి మరో ఎనిమిది, తొమ్మిది నెలల సమయం ఉందని, ఈ సమయంలో పార్టీని కూల్చేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నిస్తోంది.ఒకవేళ నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.ఒక్కో ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఖర్చు ఎమ్మెల్యేలను కొనేంత పరిస్థితి బీజేపీకి లేదని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది.ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపేంతవరకు విడిచిపెట్టమని పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది.







