దీపావళి పండుగ సందర్భంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు అదిరిపోయే బహుమతులు అందజేస్తున్నాయి.ఒకరు కార్లు, బైకులు ఆఫర్ చేస్తే మరొకరు ఏకంగా లైఫ్‌లాంగ్ ఫ్రీ కరెంట్ అందించారు.
ఫ్రీ కరెంట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.మీరు చదివింది అక్షరాలా నిజమే.
ప్రపంచంలోని అత్యుత్తమ వజ్రాల తయారీ కంపెనీలలో ఒకటైన శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ దాదాపు 1,000 మంది వజ్రాల కార్మికులకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను బహుమతిగా అందజేసింది.అంటే 25 ఏళ్ల పాటు వారు ఉచితంగా విద్యుత్ పొందొచ్చు.ఈ రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌ల ధర రూ.1 లక్ష వరకు ఉంటుంది.ఈ సోలార్ ప్యానెల్‌లతో ప్రతి నెలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని సమాచారం.
శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ యజమాని ధోలాకియా కార్లు, ఇళ్లు అంటూ గతంలో అనేక ఖరీదైన గిఫ్ట్స్ అందజేశారు.
ఇప్పుడు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా దీపావళి గిఫ్ట్ అందించారు.అలాగే పర్యావరణానికి మంచి చేసే అవగాహన వారిలో పెంచారు.గుజరాత్ రాష్ట్రం, సూరత్‌లో శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఉంటుంది.కాగా ఇక్కడే కంపెనీ తన 1000 మంది ఉద్యోగులకు దీపావళి మిలన్ వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహించింది.
ఈ వేడుకలలో ఆ కంపెనీ యజమాని గోవింద్‌భాయ్ ధోలాకియా తన ఉద్యోగులకు దీపావళి కానుకగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను బహుమతిగా ఇచ్చారు.ఈ వజ్రాల వ్యాపారి చేసిన ఆలోచనకు, తన దాతృత్వానికి చాలా మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అందరూ కూడా ఇలాగే ఆలోచించి తమ ఉద్యోగులతో పాటు పర్యావరణానికి మంచి చేయాలని కోరుతున్నారు.గోవింద్ ధోలాకియా ఉద్యోగులకు మాత్రమే కాదు కొంతకాలం క్రితం తన సొంత గ్రామం అయిన దుధాలలో ప్రజలకు ఫుల్లీ సోలార్ విద్యుత్ ఫెసిలిటీని ఉచితంగా అందించారు.