నిన్న అంటే ఆదివారం నాడు ఇండియా-పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్‌గా జరిగిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపొందాలని చాలామంది ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ చివరి వరకూ చూశారు.
వీరిలో కొంతమంది డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రపంచ కప్ మ్యాచ్‌ను వీక్షించారు.కాగా ఈ సమయంలోనే డిస్నీ + హాట్‌స్టార్‌లో లైవ్‌లో మ్యాచ్‌ను చూస్తున్న వీక్షకుల సంఖ్య 1.8 కోట్లకి చేరుకుంది.మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసిన డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో ఒకేసారి 1.8 కోట్ల మంది వ్యూయర్స్ రావడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు.దాంతో 18 మిలియన్ల వ్యూయర్‌షిప్‌తో హాట్‌స్టార్ కనీవినీ ఎరుగని రికార్డ్ సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి బంతికి 36 లక్షల లైవ్ వ్యూస్ వచ్చాయి.టీమిండియా ఛేజింగ్ స్టార్ట్ అయిన సమయంలో 40 లక్షల మందికి పైగా హాట్‌స్టార్‌లో లైవ్ మ్యాచ్ చూస్తున్నారు.పాక్ ఇన్నింగ్స్ ముగిసినప్పుడు యాప్‌లో 1.1 కోట్ల మంది వీక్షకులు ప్రత్యక్ష ప్రసారం చూసారు.ఈ సంఖ్య ఇన్నింగ్స్ విరామ సమయంలో 1.4 కోట్ల వ్యూయర్స్‌కి పెరిగింది.మ్యాచ్ భారత్‌కు అనుకూలంగా ముగిసే సమయానికి వారి సంఖ్య రికార్డు స్థాయిలో 1.8 కోట్లకు పెరిగింది.

లాస్ట్ లో హైడ్రామా నెలకొనడం వల్లనే ఈ స్థాయిలో వ్యూయర్స్ సంఖ్య పెరిగిందని తెలుస్తోంది.ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో టెలికాస్ట్ అయ్యింది.పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలో కూడా ఈ మ్యాచ్ లైవ్ లో చూపించారు.స్టార్ స్పోర్ట్స్ టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా పెరిగాయి.అయితే ఈ వీకెండ్ టైమ్‌లో ఎంత రేటింగ్స్ వచ్చాయని తెలుస్తోంది.ఇక థియేటర్లలో కూడా భారీ ఎత్తున టికెట్స్ అమ్ముడుపోయాయి.
దీనివల్ల ఒకేసారి అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల పంట పండినట్లు అయింది.