ఫ్రెండ్స్ అంటే వీరే.. తన ఫ్రెండ్‌ని ఎలా రెస్క్యూ చేశారో చూడండి..

ప్రేమ దేశం, స్నేహం కోసం, హ్యాపీ డేస్ వంటి చిత్రాలలో నిజమైన స్నేహం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించారు.నిజజీవితంలో కూడా స్నేహానికి మిత్రులు ఇంతకంటే ఎక్కువగానే విలువ ఇస్తుంటారు.

 See How They Rescued A Friend Viral Video Details, Viral Video, Frienship Video,-TeluguStop.com

అయితే తాజాగా ఒకరికి కష్టం వస్తే వారి ఫ్రెండ్స్ ఎంత గా రియాక్ట్ అవుతారో చూపించే ఒక వీడియో వైరల్ గా మారింది.ఇది చూసిన చాలామంది వావ్ అని కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు బాగా ఎమోషనల్ అవుతున్నారు.@bornAKang అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 70 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

అలానే 2 లక్షల 60 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక కారు పక్కన ఒక వ్యక్తిని కింద పడేసి ఇద్దరూ తన్నుతూ నేలకి వత్తుతూ దారుణంగా గాయపరిచారు.

ఇంతలోనే ఆ వ్యక్తి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు.ఈ దృశ్యాన్ని చూసిన వారు వెంటనే ఈ ఇద్దరిపై దాడి చేశారు.పంచుల వర్షం కురిపిస్తూ తన ఫ్రెండ్ ని ఈ భౌతిక దాడి నుంచి విడిపించారు.అయితే అప్పటి వరకు నేలపై ఉండి కన్ఫ్యూజ్ అయిన ఆ ఫ్రెండ్ తన కోసం కాపాడటానికి వచ్చిన ఓ వ్యక్తి పైన పంచ్ విసిరాడు.

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని అయిపోయాడు.ఏదైనా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తమ స్నేహాన్ని చాటుకున్నారు.

“మీ స్నేహితులు మీ కోసం ఇలా ముందుకు రాకపోతే, వారు మీ నిజమైన స్నేహితులు కాదు” అని ఈ ట్విట్టర్ పేజీ ఒక ఆప్షన్ జోడించింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఫ్రెండ్స్‌ను బాగా పొగుడుతున్నారు.అయితే మరి కొంత మంది మాత్రం ఇలా వీధుల్లో కొట్లాడటం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.ఫ్రెండ్స్ ని కాపాడుకోవడం కోసం ఎవరు కూడా మిగతా విషయాలు ఏమీ పట్టించుకోలేదని మరికొందరు కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube