బాలికల సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది.ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని 2,775 పాఠశాలల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటుచేసింది.
ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు నెలకొక కార్యక్రమం చొప్పున ఈ క్లబ్బుల ద్వారా నిర్వహించనున్నారు.సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న శారీరక వేధింపులు, లైంగికదాడులు, బాల్యవివాహాలు వంటి సమస్యలను ఎదుర్కొనే శక్తియుక్తులను వారిలో పెంపొందించడం ఈ క్లబ్బుల లక్ష్యం.