పార్టీ లో ఒంటరివాడినయ్యా అంటూ రేవంత్ కన్నీళ్లు !

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.తనకు పిసిసి అధ్యక్ష పదవి దక్కకుండా, కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానం పెద్దలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.అయినా… రేవంత్ పై నమ్మకంతో పిసిసి అధ్యక్షులు పదవిని కట్టబెట్టింది అధిష్టానం.ఇక అప్పటి నుంచి సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తూనే వస్తున్నారు.

 Revanth Reddy, Telangana Congress, Tpcc, Telangana Congress President, Komatire-TeluguStop.com

అయితే ఏ విషయంలోనూ వారు సహకారం అందించకుండా రేవంత్ ను ఇరుకుని పెట్టి ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం గా మారాయి.

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని మళ్లీ దక్కించుకునేందుకు రేవంత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నా… సీనియర్ నాయకులు సహకరించకపోవడం,  ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం , ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తనకు క్రెడిట్ వస్తుందని ఇక్కడ పార్టీ అభ్యర్థి ఓటమి చెందితే  తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం  తప్పిస్తుందనే లెక్కలతో తనను ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదంతో రేవంత్ ఒకసారిగా మీడియా ముందు కన్నీళ్లు పర్యంతం అయినట్టు కనిపిస్తున్నారు.

మొదటి నుంచి ఇదే విధంగా తనను దెబ్బ కొట్టేందుకు సొంత పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని,  పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటూ తనకు ఇబ్బందులు తెచ్చిపెట్టే విధంగా వ్యవహారాలు చేస్తున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

కీలకమైన ఉప ఎన్నికల సమయంలో రేవంత్ పార్టీ వ్యవహారాలపై మీడియా ముందు ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.అయితే సీనియర్ నాయకులుగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం,  ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం,  విదేశాలకు ఈరోజు వెళ్తుండడం వంటివి రేవంత్ కు ఆగ్రహాన్ని కలిగించాయి.
   

Telugu Aicc, Komatirajagopal, Komati Venkata, Munugodu, Revanth Reddy, Tpcc-Poli

   ఇదే విధంగా మిగతా సీనియర్లు అంటీ మొట్టనట్లుగా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నడంతో ఇక్కడ గనుక కాంగ్రెస్ వాటిని చెందితే అది పూర్తిగా తన బాధ్యత కాదని పార్టీ సీనియర్లు సహకారం అందించకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కృషి చేశారనే విషయాన్ని అధిష్టానం వద్ద సాక్షాలతో చూపించి తనకు ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకే ఈ విధంగా చేశారని అనుమానాలు కలుగుతున్నాయి అంతేకాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తల లో చురుకుదనం పెంచి తన వెంట నడిచే విధంగా చేయాలని అలాగే మునుగోడు ఓటర్ల లోనూ సానుభూతి వెల్లువెత్తితే తనకు, కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగుతుందనే లెక్కల్లో రేవంత్ ఈ విధంగా చేశారనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube