హైదరాబాద్ లోని ఎంబీఎస్ జ్యూవెలర్స్ అధినేత సుఖేశ్ గుప్తాకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.సుఖేశ్ గుప్తాకు ఈడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ నేపథ్యంగా ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.రుణాల ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో సహా పలు ఆరోపణలపై సుఖేశ్ గుప్తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
ముసద్దిలాల్ జ్యూవెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుఖేశ్ గుప్తా బంగారం వ్యాపారం చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు రావడంతో ఈడీ అధికారులు రెండు రోజులపాటు తనిఖీలు నిర్వహించారు.దీనిలో భాగంగా భారీగా బంగారంతో పాటు వజ్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.







