ఉక్రెయిన్, రష్యాల మధ్య గత కొన్ని నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే రష్యా మిసైళ్ల దాడులు కొన్ని రోజులుగా తీవ్రరూపం దాల్చాయి.
దీంతో ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారతీయులు ఎవరూ ఉక్రెయిన్ రాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా ఉక్రెయిన్‌లో ఉంటున్న విద్యార్థులతో సహా భారతీయులంతా వీలున్నంత త్వరగా ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది.ఉక్రెయిన్ రావాలనుకుంటున్న భారతీయులు తమ ప్రయణాన్ని రద్దు చేసుకోవాలని తేల్చి చెప్పింది.







