ఏపీ సీఐడీ అధిపతి సీనియర్ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు అందింది.ఏపీకి చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సీఐడీ చీఫ్ హోదాలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రతిపక్ష నేతలపై అక్రమంగా క్రిమినల్ చట్టాన్ని సునీల్ కుమార్ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.
అరెస్టు, కస్టడీ ప్రక్రియలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.ఈ ఫిర్యాదును కేంద్ర హోం శాఖతో పాటు డీఓపీటీ, సీవీసీ, కమిషన్ ఆన్ పిటిషన్స్, ఏపీ డీజీపీ, ఏపీ సీఎస్ లకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.







